Ayyo Papam song telugu lyrics

గానం : రంజిత్, మమతా శర్మ
రచన : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్


హా... సబ్ ఆషికోంకి మాషూకా హూన్ మై
సబ్ దీవానోం కి... దిల్‌రుబా హూన్ మై
ఓయ్ హిందిలో ఆపి తెలుగులోకి రా ఎహె

ఏ గాజువాక సెంటర్ కాడ గాజుల కొట్టు గంగారావు
ఏ గాజువాక సెంటర్ కాడ గాజుల కొట్టు గంగారావు
సైజే చుస్తా రమ్మంటు నా సేతులు గిల్లాడు
అయ్యో పాపం... అయ్యో పాపం...

హే జువ్వలపాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగరు బాబు
అరె జువ్వలపాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగరు బాబు
సూపులతోనే సుట్టుముట్టి కొలతలు తీసాడే..
అయ్యో పాపం... అయ్యో అయ్యో పాపం...
హే కతర్ షేకు ఖాజావళి అత్తరు లెక్కన మత్తే చల్లి
ఆడా ఈడా తేడా తేడా చేసాడే అయ్యో పాపం
మిల్ట్రీ హోటల్ మున్నాగాడు పౌల్ట్రీ ఫారం పండూగాడు
బ్యూటీ పార్లర్ బంటీగాడు చీకటైతె చాలు పిట్టగోడ దూకుడే..
హేయ్ అయ్యో పాపం... హేయ్ అయ్యో అయ్యో పాపం...
అర్రె అయ్యో పాపం... హేయ్ అయ్యయ్యయ్యో పాపం...

ఆ టింగరి మల్లి గాడు మా దగ్గరి చుట్టం వాడు
యెల్దాం పద ఐమాక్స్ అంటూ టిక్కెట్ తీసాడు
తీరా క్లైమాక్స్ అయ్యేలోపే నన్ను ఎక్స్‌రే తీసాడు
ఏ చాల్లే టక్కుటమారి చెప్పమాకే కాకమ్మ స్టోరీ
ఇంటర్వల్ల్లుకె నీకు ఇంకో పార్టీ సెట్ అయిపోయాడు
పాపం టిక్కెటు తీసిన మల్లిగాడు బుక్ అయిపోయాడు
హోయ్ అమాయకంగా ఉండేదాన్ని అమ్మాయిల్లో కొత్త రకాన్ని
అయ్యో రామా నాపై ఇన్ని నిందలు ఎందుకని..
హేయ్ జంతరు మంతరు కంత్రీ రాణి ఎక్కువలన్నీ తక్కువ కానీ
నీ ఫ్రంట్ బ్యాకు హిస్టరి మొత్తం తెలిసిన కుర్రాన్ని..
మా అమ్మ తోడు నానమ్మ తోడు ఊరికి వచ్చిన మైసమ్మ తోడు
యే పాడు మచ్చా ఎరుగదు ఈడు ఐనాగాని నన్నీ పోరగాడు నమ్మడే...
అర్రె అయ్యో పాపం... హేయ్ అయ్యయ్యయ్యో పాపం...

హో స్టూడెంటు కుర్రగాడు మా పక్కింట్లొ ఉండేవాడు
ఇంగ్లిష్ నాకు నేర్పిస్తానంటూ ట్యూషను పెట్టాడు
తీరా ఇంటికి పోతే ఇంగ్లిషు ముద్దుల టెన్షను పెట్టాడు
యేలెడు పిల్లోడే వాడు ళ్.ఖ్.ఘ్. చదివేవాడు
నీలాంటి పోరి పక్కింట్లో ఉంటే పాడై పోతాడు
పచ్చి పిందంటి వాదు నీ చూపు సోకి పండి పోతాడు
అంతో ఇంతో అందంగ ఉంటా అయిస్కాంతాన్ని మింగేసి ఉంటా
అందరి కళ్ళు నా మీదే పడితే అరిగి పోదునే
హే అక్కడ ఇక్కడ ఎవ్వరి కంటా ఎక్కువె నువ్వు చెప్పవె తంటా
నీకంత సీను సినిమా లేదు తెలుసుకోమన్నా
ఓలమ్మొలమ్మో ఈడెక్కడోడే నా నెత్తికెక్కి తైతక్కలాడే
ఏ మాట అన్నా వేడెక్కుతాడే ఈడి జోలికెళ్తె ఈపు మోత మోగునే...
హేయ్ అయ్యో పాపం... అయ్యో పాపం...
హేయ్ అయ్యో అయ్యో పాపం... అయ్యో పాపం...
అర్రె అయ్యో పాపం... అయ్యో పాపం...
అరెరెరె అయ్యయ్యయ్యో పాపం...

0 comments:

Post a Comment