Cheliya Cheliya Song telugu lyrics

గానం : కె . కె
రచన : చంద్రబోస్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్


మండే సూరీడల్లే నిండే నిప్పులల్లే
భగ భగ మన్నది నీ హృదయం
పొంగే ఉప్పెనల్లె నింగే మృత్యువల్లే
పగ పగ అన్నది నా హృదయం
ఇలా ఇలా జ్వలించుతోంది నా యెద
ఎడారిలా జలించే నా కథా
చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే  దూరం
చెలియా చెలియా నా ఊపిరిలో నిండే ఉందే నీ ప్రాణం

పువ్వేదొ నన్ను తాకితే నవ్వేదో నన్ను చేరితే
నువ్వేదొ అన్న తీపి జ్ఞాపకం...
వెన్నెల్లు వెన్ను మీటితే కన్నీళ్ళు కన్ను దాటితే
నన్నల్లుకున్న చూపు జ్ఞాపకం...
ప్రతీ దినం ప్రతీ క్షణం నీ ప్రేమలో ప్రదక్షణం
తెగించమంది నన్నే తక్షణం...
చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే  దూరం
చెలియా చెలియా నా ఊపిరిలో నిండే ఉందే నీ ప్రాణం

ప్రయాణమాయె జీవితం ప్రమాదమాయె నా పదం
శరీరమాయె మారణాయుధం...
నరాల రక్త సాగరం
కణాల అగ్ని పర్వతం
ఖలేసి రాసె మృత్యు శాసనం
ఒకే వ్రతం వినాశనం
ఒకే విధం విధ్వంసనం
నా వేటకింక లేదే విరమణం
 చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే  దూరం
చెలియా చెలియా నా ఊపిరిలో నిండే ఉందే నీ ప్రాణం....

0 comments:

Post a Comment