chiki chiki cham song lyrics and Online Listen from Anandam movie

                                           Singers : Tippu
                       
చికి చికి చాం చికి చంచంచం ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చాం చికి చంచంచం మనసంతా ఆనందం
రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం
ఆశల జెండా ఎగరేసే స్వాతంత్ర్యం ఆనందం
చికి చికి చాం చికి చంచంచం ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చాం చికి చంచంచం మనసంతా ఆనందం

ఊరించే ఊహల్లో ఊరేగడమే ఆనందం
కవ్వించే కల కోసం వేటాడటమే ఆనందం
అలలై ఎగసే ఆనందం అలుపే తెలియని ఆనందం
ఎదరేమున్నా ఎవరేమన్నా
దూసుకుపోతూ ఉంటే ఆనందం..ఆనందం..

చికి చికి చాం చికి చంచంచం ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చాం చికి చంచంచం మనసంతా ఆనందం

ప్రతి అందం మనకోసం అనుకోవటమే ఆనందం
రుచి చూద్దాం అనుకుంటే చేదైనా అది ఆనందం
ప్రేమించడమే ఆనందం ఫెయిలవ్వడమొక ఆనందం
కలలే కంటూ నిజమనుకుంటూ
గడిపే కాలం ఎంతో ఆనందం..ఆనందం...

చికి చికి చాం చికి చంచంచం ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చాం చికి చంచంచం మనసంతా ఆనందం
రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం
ఆశల జెండా ఎగరేసే స్వాతంత్ర్యం ఆనందం

0 comments:

Post a Comment