Devude digi vacchina Song Lyrics in Telugu and Online Listen

Singers : Kay kay, Usha
Lyrics : Kulasekhar


దేవుడే దిగి వచ్చినా స్వర్గమే నాకిచ్చినా
షాజహాన్ తిరిగొచ్చినా తాజ్‌మహల్ రాసిచ్చినా
ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా
లోలోన మనసంతా సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంతా సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే

వెన్నెలా చూడు నన్నిలా ఎంత హాయిగా ఉంది ఈ దినం
నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకశం
ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం
ఎప్పుడూ ముందరెప్పుడూ చూడలేదిలా దీని వాలకం
ప్రేమొస్తే ఇంతేనేమో పాపం
దాసోహం అంటుందెమో వంగి వంగి ఈ లోకం

కోయిలా నేర్చుకో ఇలా ఆమె నవ్వులో తేనె సంతకం
హాయిగా పీల్చుకో ఇల చల్ల గాలిలో ఆమె పరిమళం
నీటిపై చందమామలా నేడు తెలుతూ ఉంది నా మది
చీటికీ మాటి మాటికీ కొత్త కొత్తగా ఉంది ఏమది
అణువంతే ఉంటుందమ్మా ప్రేమా
అణచాలి అనుకొన్నామా చెస్తుందమ్మా హంగామా

దేవుడే దిగి వచ్చినా స్వర్గమే నాకిచ్చినా
షాజహాన్ తిరిగొచ్చినా తాజ్‌మహల్ రాసిచ్చినా
ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా
లోలోన మనసంతా సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంతా సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే

0 comments:

Post a Comment