Digulu padakuraa sahodaraa Song Lyrics in Telugu

గానం : వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం : భువనచంద్ర 
సంగీతం : దేవా 

దిగులుపడకురా సహోదరా
దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా
యమా యమ్మా చినదాన్ని చూళ్ళేదమ్మా
వలలోన పళ్ళేదమ్మా మనసంతా ప్రేమే కదమ్మా

దిగులుపడకురా సహోదరా
దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా

గాంధీ statue పక్కన నే చూసిన ప్రేమ వేరురా
జగదాంబ theatre లో చూసిన ప్రేమ వేరురా
వుడా పార్క్ పోయే ప్రేమ వచ్చేటప్పుడు మిగలదురా
VIP కి ప్రేమ వస్తే హోటల్ రూమ్ దొరకదు
ఆటో ఎక్కి తిరుగుతుంటే...
నేను ఆటో ఎక్కి తిరుగుతుంటే లవ్లో పడ్డదంటరా
మనసు మారి ఇంకోళ్ళని ప్రేమిస్తుంది చూడరా
కళ్ళతో నే చూసిన ప్రేమకధలు వేరురా
ఉన్నతమైన ప్రేమ నీదేరా సోదరా

దిగులుపడకురా సహోదరా
దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా

లిఫ్ట్ అడిగి వచ్చే ప్రేమ షిఫ్ట్ మారిపోయెరా
చీరలిచ్చి కొన్న ప్రేమ చేయి జారిపోయెరా
ఆఫీసులో పుట్టే ప్రేమ ఐదింటికి ముగిసెరా
మరో ప్రేమ బస్ స్టాపులో ఆరింటికి మొదలురా
నూరు రూపాయల నోటు  చూస్తే.......... 
నూరు రూపాయల నోటు చూస్తే ప్రేమ పుట్టే కాలంరా
ఊరు మొత్తం చుట్టి చూస్తే చూసిందంత మాయరా
కళ్ళతో నే చూసిన ప్రేమకధలు వేరురా
ఉన్నతమైన ప్రేమ నీదేరా సోదరా


దిగులుపడకురా సహోదరా
దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా
యమా యమ్మా చినదాన్ని చూళ్ళేదమ్మా
వలలోన పళ్ళేదమ్మా
మనసంతా ప్రేమే కాదమ్మా

దిగులుపడకురా సహోదరా
దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా

0 comments:

Post a Comment