Kita kita thalapulu Songs Lyrics in Manasantha Nuvve

గానం : చిత్ర్ర 
సాహిత్యం : సిరివెన్నెల 


 కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం
రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా
ప్రేమ ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ...
కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం

నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరే రాక
కమ్మని కలలో అయినా నిను చూడలేదే
నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంక
రెప్పపాటైనా లేక చూడాలనుందే
నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా
కాసేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా
ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ... ప్రేమ...

కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం

కంటి తడి నాడు నేడు చెంప తడి నిండే చూడు
చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా
చేదు ఎడబాటే తీరు తీపి చిరునవ్వే చేరి
అమృతం అయిపోలేదా ఆవేదనంతా
ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా
ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా
ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ... ప్రేమ...

కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం
రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా
ప్రేమ ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ...
ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ... ప్రేమ...
ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ... ప్రేమ...

0 comments:

Post a Comment