Nidare kala ayinadi Song Lyrics in Telugu & Online Listen

Singer : Sudha Raghunathan
Lyrics : Veturi
                                                                                     

పల్లవి :
నిదరే కల అయినదీ కలయే నిజమైనది!
బతుకే జత అయినదీ జతయే అతనన్నది
మనసేమో ఆగదూ క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా!... నిదరే కల అయినదీ

చరణం 1:
వయసంతా వసంత గాలి - మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారిదారి - చిగురులతో చిలకలతో
యమునకు కే సంగమమే - కడలినది కలవదులే
హృదయమిలా అంకితమై - నిలిచినది, తనకొరకే
పడినముడి పడుచు ఒడి - ఎదలో చిరుమువ్వల సవ్వడి

చరణం 2:
అభిమానం అనేది మౌనం - పెదవులపై పలకదులే
అనురాగం అనే స్వరాగం - స్వరములకే దొరకదులే
నిన్ను కలిసిన ఈ క్షణమే - చిగురించే మధు మురళి
నిను తగిలిన ఈ తనువే - పులకరించే ఎద రగిలే
యెదుటపడి కుదుటపడే - మమకారపు నివాళిలే ఇది 

0 comments:

Post a Comment