OO Vennela Telipedela Song lyrics in Prema desam and Online Listen

Singer: Unnikrishnan
                   
ఓ వెన్నెలా...తెలిపేదెలా...ఆ..ఎ
ఓ నేస్తమా...పిలిచేదెలా...ఆ..ఎ
కళ్ళూకళ్ళూ కలిసాయంట వలపే పువ్వై పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా
కళ్ళూకళ్ళూ కలిసాయంట వలపే పువ్వై పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా
ఓ వెన్నెలా...తెలిపేదెలా...ఆ..ఎ

జడివాన నింగిని తడిచేయునా
గంధాలు పువ్వుని విడిపోవునా
నన్నడిగి ప్రేమ ఎదచేరెనా
వలదన్న ఎదను విడిపోవునా
మరిచాను అన్నా మరిచేదెలా
మరిచాక నేను బ్రతికేదెలా
ఓ వెన్నెలా...తెలిపేదెలా...ఆ..ఎ

వలపించు హృదయం ఒకటే కదా
ఎడమైతే బతుకు బరువే కదా
నిలిపాను ప్రాణం నీకోసమే
కలనైన కూడా నీ ధ్యానమే
మదిలోని ప్రేమ చనిపోదులే
ఏనాటికైనా నిను చేరులే

ఓ వెన్నెలా...తెలిపేదెలా...ఆ..ఎ
ఓ నేస్తమా...పిలిచేదెలా...ఆ..ఎ
కళ్ళూకళ్ళూ కలిసాయంట వలపే పువ్వై పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ ఎదలో బాధ తీరేదెట్టా
కళ్ళూకళ్ళూ కలిసాయంట వలపే పువ్వై పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ ఎదలో బాధా తీరేదెట్టా

0 comments:

Post a Comment