Priya ninu choodaleka Song Lyrics in Telugu from Premalekha Movie

గానం : బాలుఅనురాధ శ్రీరాం 
రచన : భువన చంద్ర 
సంగీతం : దేవా 
                           
ప్రియా నిను చూడలేక.. ఊహలో నీ రూపు రాక..
నీ తలపుతోనే... నేబ్రతుకుతున్నా
నీ తలపుతోనే నే బతుకుతున్నా

ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాక

వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం
ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం
అనుక్షణం నా మనసు తహతహలాడే
ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
అనుదినం కలలలో నీ కథలే
కనులకు నిదురలే కరువాయే

ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాకా

కోవేలలో కోరితిని నీ దరికి నను చేర్చమని
దేవుడినే వేడితిని కలకాలం నిను చూడమని
లేఖతో ముద్దైన అందించరాదా
నినుకాక లేఖలనే పెదవంటుకోదా
వలపులు నీ దరి చేరుటెలా
ఊహల పడవలే చేర్చునులే

ప్రియా నిను చూడలేక.. ఊహలో నీ రూపు రాక..
నీ తలపుతోనే... నేబ్రతుకుతున్నా
నీ తలపుతోనే నే బతుకుతున్నా



ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాక

0 comments:

Post a Comment