Vevela Gopemmala Songs lyrics in Telugu & Online Listening

Singers - S.P.Sailaja, S.P.Balu
Lyrics : Veturi Sundararama Murthy
                 
వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల
వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే
అహహ వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే
మా ముద్దు గోవిందుడే

మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడె..
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడె
కన్న తోడు లేని వాడే కన్నె తోడు వున్నవాడె
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనే
మోహనాల వేణువూదే మోహనంబుడితడేనే
చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తీర్చినాడే
పోతన్న కైతలన్నీ పోతపోసుకున్నాడే
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

ఆ..అహహహ వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే
మా ముద్దు గోవిందుడే

వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
రాస లీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

ఆ..అహహహ వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే
మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల
వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే
అహ అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల
వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే
ఆ..అహహహ వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే
మా ముద్దు గోవిందుడే

0 comments:

Post a Comment