Yerupu lolaku kulikenu Song Lyrics in Telugu From Premalekha Movie

గానం : బాలు 
సాహిత్యం : భువనచంద్ర 
సంగీతం : దేవా 
ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను

ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను
అమ్మమ్మ అందాలే ఏనుగెక్కి పోతుంటే
కళ్ళతో కొంటెగా సైగలేవో చేస్తుంటే
రాజస్థానీ కన్నె పిల్ల వయసుకు వన్నెలు వచ్చిన వేళ

ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను

మనసంతా మనసంతా మరుమల్లెల పులకింత
వయసంతా వయసంతా చిరుకవితల కవ్వింత
మనసంతా మనసంతా మరుమల్లెల పులకింత
వయసంతా వయసంతా చిరుకవితల కవ్వింత
ఏ ఊరి చల్లగాలి ఈ ఊరికొచ్చెనమ్మ
ఒంటె మీదకెక్కి నన్ను ఊరి చుట్టూ తిప్పెనమ్మ
ఏటి గట్టు ఊరి గట్టు నన్ను చూసి పాడంగా
సంగతులు ఎన్నెన్నో వంతులేసి చెప్పంగా
రాజస్థాని కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ

మనసంతా మనసంతా మరుమల్లెల పులకింత
వయసంతా వయసంతా చిరుకవితల కవ్వింత

ఆకాశం ఆకాశం ఈ సుందర ఆకాశం
బహుదూరం బహుదూరం మనకందని నవలోకం
ఆకాశం ఆకాశం ఈ సుందర ఆకాశం
బహుదూరం బహుదూరం మనకందని నవలోకం
చుట్టి చుట్టి నన్ను చుట్టె చక్కనైన తోకచుక్క
ముద్దు ముద్దు మాటలాడే ముచ్చటైన పాలపిట్ట
అందాలూ చిందెనులే లేత నుదిటి కుంకుమలు
పగ్గాలే వేసెనులే మేలి నీలి ముంగురులు


రాజస్థానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ

ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను
ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను
అమ్మమ్మ అందాలే ఏనుగెక్కి పోతుంటే
కళ్ళతో కొంటెగా సైగలేవో చేస్తుంటే
రాజస్థానీ కన్నె పిల్ల వయసుకు వన్నెలు వచ్చిన వేళ

ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను

0 comments:

Post a Comment